ప్రజాశక్తి-విజయనగరం కోట : నవంబర్ 9, 10, 11వ తేదీలలో విజయనగరంలో అభినయ – నాటకశాల సంయుక్త నిర్వాహణలో నటరత్న నాటక పరిషత్ 8వ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు అభినయ శ్రీనివాస్ కార్యదర్శి గెద్ధ వరప్రసాద్ ప్రకటించారు. మంగళవారం స్థానిక కార్యాలయం వద్ద ఆహ్వాన నాటిక పోటీలకు సంబంధించిన పొస్టర్ విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ … ఈ అభినయ నాటక పరిషత్ ను 2015 సంవత్సరంలో స్థాపించి నేటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా ఈ నాటకాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మూడు రోజులపాటు రోజుకి రెండు నాటకాలు చొప్పున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నాటకాలన్నీ ఉత్తమ బహుమతులు పొందినవేనని తెలిపారు. నవంబర్ 9వ తేదీన కళాంజలి హైదరాబాద్ వారితో రైతే రాజు, నాటకశాల విజయనగరం వారితో బంధనం నాటికలు రెండవ రోజు ఉషోదయ కళానికేతన్, కాట్రపాడు గుంటూరు జిల్లాకు చెందిన వారితో విముక్తి నాటిక, అదేవిధంగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాదుకు వచ్చే మూల్యం నాటికలు మూడవ రోజు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారితో ఇంద్ర ప్రస్థానం, శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సంఘం, బోరువంక, శ్రీకాకుళం వారితో కొత్త పరిమళం నాటికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నాటికలన్నీ సమాజ అభ్యున్నతికి పురోగమనానికి ఎంతో తోడ్పడతాయని తెలిపారు. సమాజంలో ఉండే రుగ్మతలను రూపుమాపడానికి నాటికలు బాధపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యురాలు సూర్యలక్ష్మి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.