అక్రమంగా తరలిస్తున్న డీజిల్‌ స్వాధీనం – డ్రైవర్‌ అరెస్టు

ప్రజాశక్తి-కాజులూరు (కాకినాడ) : అక్రమంగా తరలిస్తున్న డీజిలును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రాజమండ్రి విజిలెన్స్‌ ఎస్సై టి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎంఎస్‌ఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎస్సై జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ …. శుక్రవారం కాజులూరు మండలం కోలంక వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా యానం నుండి పెదపూడి వెళుతున్న ఐషర్‌ వ్యాన్‌ ను తనిఖీ చేయగా ఇందులో 16 పీపాల్లో ఉన్న 3200 లీటర్ల డీజిల్‌ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. గొల్లపాలెం స్టేషన్లో ఐషర్‌ వ్యాన్‌, డ్రైవరును అప్పగించి ఐఓసీ పెట్రోల్‌ బంక్‌ లో డీజిల్‌ అప్పగించినట్లు తెలిపారు. డీజిల్‌ విలువ రూ.2,72,000 ఉంటుందని వారు తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది కుమార్‌, కిషోర్‌, వీఆర్వో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️