అరకు-కొత్తవలస లైన్‌లో డిఆర్‌ఎం తనిఖీ

May 13,2024 00:52 #Drm, #lines inspection
Drm, line inspection

ప్రజాశక్తి-విశాఖపట్నం : వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్‌ నేతృత్వంలో అరకు-కొత్తవలస సెక్షన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలు, డబుల్‌ లైన్‌ పనులు, భద్రతా చర్యలపై సమీక్షను నొక్కి చెప్పారు. ఎడిఆర్‌ఎంలు సుధీర్‌ కుమార్‌ గుప్తా, మనోజ్‌ కుమార్‌ సాహూ, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌, ఎలక్ట్రికల్‌, సిగల్‌ టెలికాం, సేఫ్టీ, ఇతర విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులు డిఆర్‌ఎం సౌరభ్‌ విభాగంలో కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల పురోగతిని ప్రసాద్‌ నిశితంగా విశ్లేషించారు. తనిఖీ సందర్భంగా, డిఆర్‌ఎం ప్రసాద్‌ డబ్లింగ్‌ పనులు, సొరంగాలు, పాయింట్లు, క్రాసింగ్‌ల పురోగతి, వంతెన నిర్వహణ కార్యకలాపాలు, ట్రాక్షన్‌ సబ్‌-స్టేషన్లు, సౌకర్యాలు, సైడ్‌వాల్‌ రక్షణ, నీటి పరీవాహక ప్రాంతాల వంటి భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు. ప్రయాణీకుల భద్రత, రైల్వే మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి టన్నెల్‌ ప్రాంతాలకు సమీపంలో నీటి ప్రవాహం, బురద ప్రవహించే ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంకా డిఆర్‌ఎం ప్రసాద్‌ శివలింగాపురం, త్యాడ స్టేషన్లలో భద్రతా తనిఖీలు నిర్వహించారు. కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లు మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు. కొత్తవలస వరకు ఉన్న సెక్షన్‌లో సమగ్ర విండో ట్రయిలింగ్‌ తనిఖీ కూడా నిర్వహించారు.

➡️