ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ గురువారం వాల్తేర్ డివిజన్ లోని విజయనగరం-రాయగడ రైల్వే సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ సెక్షన్‌లో ప్రస్తుతం జరుగుతున్న మూడో లైన్ పనుల పురోగతి, స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాయగడ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, పార్కింగ్ సదుపాయాలు, స్టేషన్ భవనాల మెరుగుదల, రైల్వే కాలనీ అభివృద్ధి తదితర అంశాలను పరిశీలించారు. కెయుట్‌గూడ స్టేషన్‌లో తనిఖీ సందర్భంగా, సౌరభ్ ప్రసాద్ భద్రతా ఆడిట్ నిర్వహించారు. అనంతరం విజయనగరం నుంచి రాయగడ వరకు విండో-ట్రైలింగ్ తనిఖీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడిఆర్‌ఎం (ఆపరేషన్స్) మనోజ్ కుమార్ సాహూ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
