శివలింగపురం యార్డులో డిఆర్‌ఎం తనిఖీ

May 25,2024 23:54 #DRM checking, #KK line
KK Line, DRM Checking

 ప్రజాశక్తి-విశాఖపట్నం: కొత్తవలస-కిరండూల్‌ (కెకె) లైన్‌ వెంబడి కార్యాచరణ సామర్థ్యం, భద్రతా చర్యలను మెరుగుపరచడానికి శివలింగపురం స్టేషన్‌ యార్డ్‌లో వాల్తేరు డిఆర్‌ఎం సౌరభ్‌ప్రసాద్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలో ఐరన్‌ ఓర్‌ రవాణా కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడమే లక్ష్యంగా సిగలింగ్‌, ట్రాక్‌ మెరుగుదల, పాయింట్లు, క్రాస్‌ఓవర్‌లు, ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రిఫికేషన్‌తో సహా లే-అవుట్‌ సవరణలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఎం మాట్లాడుతూ, కార్యాచరణ సామర్థ్యం, భద్రత చాలా ముఖ్యమైనదన్నారు. ప్రత్యేకించి కెకె లైన్‌ వెంబడి ఇనుప ఖనిజం రవాణా కోసం సామర్థ్యం, భద్రతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎడిఆర్‌ఎం సుధీర్‌ కుమార్‌ గుప్తా, సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ విజేంద్ర కుమార్‌, సీనియర్‌ డివిజనల్‌ సిగల్‌, టెలికాం ఇంజినీర్‌ దీప్తాన్షు శర్మ, సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ (ట్రాక్షన్‌) పాండి టామ్‌, సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ ఓపెర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌తో సహా కీలక సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.

➡️