‘పది’లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి :డిఆర్‌ఒ ప్ర

జాశక్తి-రాయచోటి పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా కషి చేయాలని డిఆర్‌ఒ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. మదనపల్లి రోడ్‌లోని పిసిఆర్‌ కల్యాణ మండపంలో బుధవారం పదవ తరగతి ఫలితాలపై ప్రధానోపాధ్యాయులకు ఏర్పాటుచేసిన సమీక్ష సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులతో ఆయన మాట్లా డుతూ పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రథమ స్థానంలో ఉంచేందుకు కషి చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలపై ప్రతి విద్యార్థికి అవగాహన పెంచాలని, అలా పెంచినప్పుడే విద్యార్థి బాగా చదివి మంచి ఫలితాలను సాధిస్తారని అన్నారు. చదువులో వెనుకబడిన సి,డి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనం తరం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ పరీక్షల పట్ల విద్యార్థులలో ఉన్న భయాన్ని, ఒత్తిడిని తొలగించడానికి ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం డిప్యూటీ డిఇఒ శివప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ చదువులో వెనుక బడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేందుకు పాఠ్యాంశాలలోని ముఖ్యమైన భావనలపై, పటాలపై, పట్టికలపై అవగాహన కలిగించాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ఎస్‌సిఇఆర్‌టి రూపొందించిన 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం షేక్‌ మహమ్మద్‌ హసీం ఆధ్వర్యంలో నిపుణులైన ఉర్దూ ఉపాధ్యాయులు పదవ తరగతి ఉర్దూ విద్యార్థుల కోసం తయారుచేసిన అధ్యయన సామగ్రిని అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా సెక్రెటరీ మడితాటి నరసింహారెడ్డి, డిసిఇబి సెక్రెటరీ నాగమునిరెడ్డి, ప్రధానోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రామకష్ణ, ఐఇడి కో-ఆర్డినేటర్‌ జనార్ధన్‌, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న డిఆర్‌ఒ మధుసూదన్‌రావు

➡️