ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ మానవ మనుగడ సాఫీగా సాగాలంటే మానవుడితోపాటు వక్షాలు, క్రిమి కీటకాలు, వన్య మగాలు సైతం భూమిపై జీవించినప్పుడే జీవవైవిద్యం వలన మానవ మనుగడ సాగుతుంది. కొందరు మానవ మగాలు నోరులేని జీవాలను ఉచ్చులేసి ప్రాణాలు హరించివేస్తున్నారు. వేటగాళ్ల వలలో వన్య మగాలు ఇరుక్కొని ప్రాణాలు కోల్పోతున్నాయి. వన్య మగాల సంరక్షణ చట్టం అమలులో ఉన్నా కొందరు అటవీ అధికారుల తప్పిదాల వలన లక్ష్యం నీరుగారుతోంది. వన్యమగాలకు రక్షణ కరువవుతోందని చెప్పడంలో సందేహం లేదు. గత శుక్రవారం పెనగలూరు మండలం వెలగచర్ల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు కనితికి సంబంధించిన శరీర భాగాలు పట్టుకున్నట్లు సమాచారం. వెలగచర్ల గ్రామానికి చెందిన రాజంగారి వెంకటస్వామి, రాజంగారి శ్రీకాంత్, రాజంగారి వెంకటసుబ్బయ్య రెండు కనితులను విద్యుత్ తీగలతో వలవేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రధాన నిందితుడు వెంకటస్వామి పరారీలో ఉండగా అటవీ శాఖ అధికారులు వెంకటసుబ్బయ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు రాజంగారి వెంకటస్వామి కేసును తప్పుదోవ పట్టించి బయటపడేందుకు అజ్ఞాతంలో ఉంటూనే ఆర్థిక, అంగ, రాజకీయ బలాలు ప్రయోగిస్తున్నట్లు వినికిడి. నిందితుడు గతంలో కూడా పలుమార్లు అటవీ ప్రాంతంలోని తన పొలం వద్ద ఇలాగే విద్యుత్ తీగలు తగిలించి వన్యమగాలను చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వన్య మగాల సంరక్షణ చట్టం ప్రకారం చిట్వేల్ రేంజ్ అటవీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తగిన శిక్ష విధిస్తారా లేదా అన్న చర్చ వెలగచర్ల గ్రామంలో వెల్లువెత్తుతున్నాయి.చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం నిందితుడు ఎంతటి వాడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకడైన రాజంగారి వెంకటసుబ్బయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఫోన్‌లో ఆయనను సంప్రదించగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.