మొద్దునిద్ర

ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో సంక్షో భం నెలకొంది. ఒకవైపు కరువు, మరోవైపు విద్య, వైద్య రంగాల పాలనా వైఫల్యాలు ఆందోళన కలిగించడం తెలిసిందే. ఆర్నెళ్ల కిందట కడప జిల్లా డిఇఒ విధుల్లోకి వచ్చినప్పటి నుంచి వివాదా స్పదం వైఖరిని అవలంభించడం విమర్శలకు కారణంగా మారింది. జిల్లాలోని 35 మండలాలకు చెందిన సుమారు ఏడు వేల మంది ఉపాధ్యాయ, సిబ్బందిల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నెల రోజుల కిందట జిల్లాలోని 2,328 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బయోడేటాను సకాలంలో అప్‌లోడ్‌ చేయలేదనే కారణంతో 800 మంది ప్రభుత్వ ప్రధానో పాధ్యాయులకు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ డిఇఒ తగ్గలేదు. ఇటీవల ఇలియాస్‌బాషా అనే ఉపాధ్యాయుడు మృతి చెందడం వెనుక డిఇఒ నిర్లక్ష్య వైఖరి ఉందనే కారణంతో జిల్లా ఉపాధ్యాయ లోకం ఉద్యమబాట పట్టింది. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ఆన్‌లైన్‌ వివరాలను అప్‌లోడ్‌ అంశంలో నిర్లక్ష్యం నెలకొందనే ఉద్దేశంతో జారీ చేసిన నోటీసుల ఘటనలో ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి మొదలుకుని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అప్పట్లో డిఇఒ తన వైఖరిని కాస్త సడలి ంచుకున్నట్లు కనిపించింది. తాజాగా ఓ ఉపాధ్యాయుని మృతి వెనుక డిఇఒ కఠిన వైఖరి ఉందనే ఆరోపణల నేపథ్యంలో జిల్లాలోని ఉపాధ్యాయ సం ఘాలన్నీ 10 రోజులుగా ముక్తకంఠంతో ఈ డిఇఒ మాకొద్దు అంటూ నినది స్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో బుద్ధిజీవుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఎవరికీ పట్టడం లేదు. కలెక్టర్‌ మొదలుకుని రాష్ట్ర విద్యాశాఖా కమిషనర్‌, విద్యాశాఖా మంత్రి లోకేష్‌ వరకు ఎవరికి పట్టక పోవడం ఆందోళనకరం. పాలకుల నిర్లక్ష్యపు వైఖరి కారణంగా జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన కొనసా గిస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది. అన్నమయ్య జిల్లాలోని ఖరీఫ్‌ కరువు పరిస్థితులను అంచనా వేయడంలో పాలకులు మొద్దునిద్రను నటించడం ఆందోళనకరం. 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో 21 మండలాల్లో కరువు కరాళ నృత్యం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25 ఖరీఫ్‌ సీజన్‌ ముగి సింది. రబీ సీజన్‌ సైతం ముగింపు దశకు చేరుకుంది. దశలో కేంద్ర ప్రభుత్వం కరువు బృందాలను పంపించడం వల్ల కరువు పరిస్థితుల్ని ఎలా అంచనా వేస్తుందో తెలియడం లేదు. ఏ పారామీటర్ల ఆధారంగా కరువు తీవ్రతను అంచనా వేస్తుందో తెలియడం లేదు. అనంతరం కరువు నివారణకు ఎటు వంటి సిఫారసులు చేస్తుందో తెలియడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కరువు పరిస్థితుల నెలకొన్న సీజన్‌లో అతివృష్టి, అనావృష్టి పరిస్థి తులను అంచ నా వేయడానికి కరువు బృందాలను పంపించాలి. అప్పుడే వాస్తవిక అంచనాలకు రావడానికి అవకాశం ఉంటుందని గ్రహించాలి. వాస్తవ అంచనాల ఆధారంగా రైతాంగాన్ని ఆదుకోవడంపై అవగాహన ఏర్ప డుతుంది. వాస్తవిక అవగాహన నేపథ్యంలో ప్రభుత్వాలు ఏమేరకు సహకా రాన్ని అందించాలనే అంశంపై స్పష్టత వస్తుందనడంలో సందేహం లేదు. – ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️