ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థుల ర్యాలీ
ప్రజాశక్తి – యలమంచిలి
డ్రగ్స్, మాదక ద్రవ్యాలను అరికట్టాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ), భారత ప్రజాతంత్రం యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) ఆధ్వర్యాన బుధవారం విద్యార్ధులు యలమంచిలిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్డులో తులసీ చిత్రమందిర్ జంక్షన్ నుండి బస్టాండ్, వైఎస్‌ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం రమణ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శివాజీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బారిన పడి విద్యార్ధులు నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వీటి మూలంగా దొంగతనాలు, దోపిడీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ భూతం పట్టణాల నుంచి పల్లెలకు కూడా వ్యాపిస్తోందని అభిప్రాయపడ్డారు. వాటిని అరకట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలాజీ, కేశవ, శ్రీను, మణికంఠ, కృపా, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.