ఏసీబీ వలలో సివిల్‌ సప్లయిస్‌ డీటీ శ్రీనివాస్‌

Apr 17,2024 16:30 #krishna

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) :మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్‌ సప్లయిస్‌ డీటీ చెన్నూరి శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్‌ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్‌ మిల్లు యజమాని వినరు కుమార్‌ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశాడు.దీంతో వినయ్ కుమార్‌ ఎసిబి ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏ సి బి అధికారులు ఈ నెలకు సంబంధించి బుధవారం స్థానిక బైపాస్‌ రోడ్‌ లో ఓ పెట్రోల్‌ బంక్‌ లో డి టి శ్రీనివాస్‌ కు మిల్లు యజమాని పది వేలు మామూలు ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత నేరుగా పట్టుకున్నారు.పట్టుబడ్డ డీటీని ఎసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్న ఎసీబీ స్నేహిత తెలిపారు.

➡️