ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : స్థానిక శ్రీసిద్ధార్థ స్కూల్ ఆలమూరు వద్ద దసరా ఉత్సవాలు డైరెక్టర్ కె.ముల్లారావు అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విద్యార్థులకు, తల్లితండ్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా పండగ అతి ముఖ్యమైనదన్నారు. విజయ దశమి అనగా విజయానికి నాంది అని అర్థంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు అనేక సాంస్కఅతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. మరి ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన మహిషాసుర మర్థనం నాటక ప్రదర్శన చూపరులందిరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ కట్టా రాజు, పాఠశాల ప్రిన్సిపాల్స్ ఎం.ఆర్.ప్రమోదలాల్, టి.కె.సింధు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.