ప్రజాశక్తి – రాప్తాడు : మండల కేంద్రంలొ తహసిల్దార్ ఆఫీస్ నందు రైతు సంఘం మండల నాయకులు పోతలయ్య మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తరపున, రైతుల తరఫున, డిమాండ్ పత్రాన్ని తహసిల్దార్ విజయ కుమారికి అందజేయడం జరిగింది. జిల్లాలో రైతుల పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పులు చేసి, తమ భార్యల మెడలో ఉన్న బంగారం, పుస్తెల్లు, బ్యాంకుల్లొ తాకట్టుపెట్టి సాగు చేసిన తర్వాత దిగుబడి రాక రైతు నిత్యం నష్టాలను చవిచూస్తూ, కనీసం అరకొరగ పండిన పంటలకైన గిట్టుబాటు ధర లేక చివరకు రైతులు, ఆత్మహత్యలే పరిష్కార మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలు కూడా తమ భర్తల పంటలకు కొరకు వ్యాపారం కొరకు డ్వాక్రా లోన్లు తీసుకుని చాలా గ్రామాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఆవేదన, వీరి బాధ వర్ణనాతీతం. కూటమి ప్రభుత్వాలు వీరి ఉసురు పరిపూర్ణంగా పోసుకుంటున్నాయి. రానున్న కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల మనుగడ శాశ్వతంగా ప్రశ్నార్థకంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, సర్వేలు వెల్లడించాయి. బ్యాంకులకు వచ్చిన సర్కులర్స్ తెలుగులో నోటీసు బోర్డులో పెట్టాలి. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలి. ప్రతి రైతుకు ప్రతి మహిళకు, తాకట్టు లేకుండా 5 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం పూర్తి స్థాయిలో పొందగలుగుతాయని పత్రికలు, ప్రతిపక్షాలు, ఇతర కమ్యూనిస్టు పార్టీలు, సర్వేలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలొ రైతు సంఘం రాప్తాడు మండల నాయకులు పోతలయ్య, సుబ్బిరెడ్డి, ఎర్రి స్వామి రెడ్డి, వెంకట్రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, పెద్దపోతలయ్య, అంజన్ రెడ్డి, మొదలగు రైతులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల బంగారు రుణాలుకు, డ్వాక్రా రుణాలకు, వడ్డీ చెల్లింపులతొ రెన్యువల్ చేయాలి
