ప్రజాశక్తి-కొండపి : కొండపి మండలంలో మహిళా మార్ట్‌ల ఏర్పాటు కోసం ప్రతి సభ్యురాలితో వాటాధనం కట్టించి వాటాదారుగా చేయాలని డిఆర్‌డిఏ పిడి టి రవికుమార్ సిబ్బందికి సూచించారు. బుధవారం నాడు డిఆర్‌డిఏ కొండపీ కార్యాలయాన్ని డిఆర్‌డిఏ జిల్లా ప్రాజక్ట్ డెరైక్టర్ సందర్శించి ఏపిఎం, సిసిఎస్, విఓఏలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శాఖ పరిధిలో మండలంలో జరుగుచున్న ప్రాజెక్ట్ కార్యక్రమాలు ప్రోగ్రెస్‌పై స్టాఫ్‌తో సమీక్ష చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మహిళా మార్ట్ ఏర్పాటు కోసం తగు చర్యలు తీసుకోవాలని స్టాఫ్‌కు ఆదేశాలిచ్చారు. మహిళల జీవనోపాధి కోసం అందిస్తున్న సామాజిక పెట్టుబడి రుణాలు, స్త్రీ నిధి రుణాలు, ఎస్సీఎస్టీ లకు ఇస్తున్న ఉన్నతి రుణాలు విడుదల చేయడంలో చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రన్ అవుతున్న లోకోష్ యాప్ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వీటితో పాటుగా విపిఆర్‌పి, ఆజీవిక, ఎస్‌హెచ్‌బి ఇన్‌కం ప్రొఫైల్ వర్క్‌లు కూడా త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కో-ఆర్డినేటర్ కత్తి కళ్యాణ్‌రావు, ఏపిఎం బి గోపినాథ్, సిసిలు డి మల్లిఖార్జున, వి కృష్ణారెడ్డి, కె రామాంజనేయులు, అకౌంటెంట్ జి కోటేశ్వరి పాల్గొన్నారు.
శింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలోని కొండపి, మండలంలో శింగరాయకొండ మండల కేంద్రాల్లో మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేస్తున్నామని డిఆర్‌డిఏ పీడీ టి రవి కుమార్ తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ వాలంటీర్ల వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆదేశాల మేరకు కొండపి, శింగ రాయకొండలో మహిళా మార్ట్‌లు ఏర్పాటు జరుగుతుంద న్నారు. ఇప్పటికే టంగుటూరులో ఈ మహిళా మార్ట్ ఉంద ని, దానికి విభిన్నంగా అన్ని హంగులతో ఇక్కడ పెడుతు న్నామన్నారు. వివోఏలతో సమావేశం ఏర్పాటు చేసి మహిళ సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేసి ఈ విషయాలను వారితో చర్చించి తీర్మానాలు అయిపోయిన తర్వాత మహి ళా మార్ట్‌లు ఈ రెండు మండలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సెర్ఫ్ అధికారులు కిరణ్, ఏపీఎం భాగ్యలక్ష్మి, సీసీలు మాధవరావు ఉన్నారు.
