డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యం

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో డ్వాక్రా మహిళలకు అందు బాటులో ఉంటూ వారి ఆర్థిక అభివధ్ది పాటుపడటమే తమ లక్ష్యమని జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో డిఆర్‌డిఎ కార్యాలయాలు, మహిళ సంఘాలు, సభ్యులు, ప్రస్తుతం చేపడుతున్న పథకాలు, డ్వాక్రా మహిళలు ఆర్థిక అభివద్ధి ఎలా పొందాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.జిల్లా వ్యాప్తంగా డిఆర్‌డిఎ కార్యాలయాల వివరాలు తెలపండి? జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా సమైఖ్య కార్యాలయం ఉంది. డిఆర్‌డిఎ కార్యాలయంతో పాటు 30 మండలాల్లో 30 వెలుగు కార్యాలయాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయి ? సభ్యులు ఎంతమంది ఉన్నారు? జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 31,125 సంఘాలున్నాయి. 3,11,250 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు వివరించండి? ప్రస్తుతం ఎస్‌హెచ్‌జి లకు సంబంధించి 2025 – 26 సంవత్సరానికి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నాం. వీటితో పాటుగా సంఘాలు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి నెలా సచివాలయాల ద్వారా పెన్షన్‌ పంపిణీ చేస్తున్నాం.స్వయం ఉపాధికి చేపడుతున్న పథకాలు తెలపండి? ఎస్‌హెచ్‌జి బ్యాంక్‌ లింకేజి, స్త్రీనిధి, ఉన్నతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్లు ఎన్ని ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా కింద 2,16,821 పెన్షన్లున్నాయి. లబ్ధిదారులకు రూ. 93.5 కోట్లు పింఛన్లు పంపిణీ చేశాం. ఇందులో వద్దులు, వితంతు, వికలాంగులు, చేనేతలు, ఒంటరి మహిళలు, చర్మకారులు, డప్పు కళాకారులు, అభయహస్తం, కిడ్నీ బాధితులు, గీత కార్మికులు అందరికీ ప్రతినెలా 1న పింఛన్లు పంపిణీ చేస్తున్నాం.రుణాలు పొందాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనా? డ్వాక్రాలు మహిళలు రుణాలు పొందాలంటే ఎవ్వరికీ, ఒక్క రూపాయి కూడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడుగుతున్నట్లు తమకు ఫిర్యాదు చేస్తే వారి పైన తగు చర్యలు తీసుకుంటాం. సిబ్బంది కొరత ఏమైనా ఉందా? గతంలో సిబ్బంది కొరత ఉండేది. ప్రస్తుతం లేదు. మహిళా సంఘాలకు సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? మహిళా సంఘాలు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలలో, శిక్షణలలో చురుకుగా పాల్గొంటూ అవగాహన పెంచుకోవాలి. అందరూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకుంటూ, పారదర్శకంగా ఉంటూ అభివద్ధి సాధించాలి. మహిళలు తీసుకుంటున్న రుణాలను సంక్రమంగా జీవనోపాదుల కోసం ఉపయోగించుకుని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలి.

➡️