కానిస్టేబుల్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహించాలని డివైఎఫ్‌ఐ ధర్నా

Mar 13,2025 11:18 #Dharna, #DYFI, #vijayanagaram
  • పోలీస్‌ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌
  • కోట వద్ద ప్లే కార్డులతో నిరసన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహించాలని, పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ నిరుద్యోగ అభ్యర్థులు కోట జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ సిహెచ్‌.హరీష్‌ మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వ హయాంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ 2022 నవంబర్‌ 28న 6100 పోస్టలకు నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. 2023 జనవరి 22న ఫ్రీలిమ్స్‌ పరీక్షకు 4,59,182. మంది హాజరయ్యారని.. ప్రిలిమ్స్‌ పరీక్షలలో 95 208 మంది అర్హత సాధించారని తెలిపారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు, కోర్టు కేసుల వల్ల 2024 డిసింబర్‌ 22 నుండి జనవరి 16 వరకు ఈవెంట్స్‌ జరిగాయన్నారు. మెయిన్‌ ఎగ్జామ్‌ గురించి ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్ర పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న 20వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ నిరసన కార్య్కమంలో నాగరాజు, శివ, లక్ష్మణ,, కానిస్టేబుల్‌ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️