మెగా డీఎస్సీ పై తొలి సంతకం పెట్టాలి : డివైఎఫ్ఐ

Jun 11,2024 15:59 #DYFI, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : 25 పోస్టులతోమెగా డీఎస్సీపై మొదటి సంతకం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై నగేష్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా. చంద్రబాబు నాయుడు కు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీపై పెట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, నగర కార్యదర్శి హుస్సేన్ భాష లు కోరారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకు నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతి జూలై నుండి ఇవ్వాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది మంచి అవకాశం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం, కర్నూలు రైల్వే వ్యాగన్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తేవాలని సూచించారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం, నియంతృత్వంగా వ్యవహరించడం వల్లే తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు.

➡️