ప్రతి హమీని కూటమి ప్రభుత్వం నేర వేరుస్తుంది

Jan 10,2025 16:07 #Kadapa

ప్రజాశక్తి – వేంపల్లె : ప్రజలకు ఇచ్చిన ప్రతి హమీని కూటమి ప్రభుత్వం నేరవేరుస్తుందని అందుకు సిఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నట్లు మాజీ ఎమెల్సీ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఇమాం నగర్ వీధిలో రూ 7.50 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మాజీ ఎమెల్సీ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రారభించారు. అంతకు ముందు శ్రీ వృషబాచలేశ్వర స్వామి దేవస్థానంకు చెందిన ఎద్దుల కొండపై ఏర్పాటు చేసిన వైకుంఠ దర్శనంకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఆయనకు అలయం విశిష్టతపై ఆలయ అధికారులు, అర్చకులు తెలియ జేశారు. మాజీ ఎమ్మెల్సీ బిటెక్ ఎద్దుల కొండపైకి రావడంతో ఆలయ అధికారులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని పాలక మండలి మాజీ సభ్యుడు పివి రమణ, ఇఓ విశ్వనాథ్ రెడ్డిలు బిటెక్ ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లును వేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నేరవేర్చేందుకు సిఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగిందని, ఇచ్చిన హమీలను నేర్చేందుకు కొద్దిగా ఆలస్యంగా అవుతున్నట్లు చెప్పారు. హమీలు మాత్రం తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. సిమెంటు రోడ్లు పనులు నాణ్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీ వృషబాచలేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కూడ దేవాదాయ శాఖ మంత్రితో కలిసి చర్చిస్తామని చెప్పారు. అనంతరం టిడిపి నాయకులు, కార్యకర్తలను కలుసుకొని వారి సమస్యలను విన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్పీ జయరామిరెడ్డి, రజనీకాంత్ రెడ్డి, మహమ్మద్ ఇనాయతుల్లా బాలస్వామిరెడ్డి, జగన్నాథరెడ్డితో పాటు పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️