నామినేటెడ్‌ పదవుల్లో ప్రాథమిక ఇవ్వాలి : తూర్పు కాపు జిల్లా అధ్యక్షులు

ప్రజాశక్తి-విజయనగరం కోట : తూర్పు కాపులకు నామినేటెడ్‌ పదవులలో ప్రాధాన్యత కల్పించాలని తూర్పు కాపు జిల్లా అధ్యక్షులు అంబల్ల అప్పలనాయుడు అన్నారు. మంగళవారం నాడు స్థానిక కామాక్షి నగర్‌ తూర్పుకాపు సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతి ఎన్నికల్లో కాపులకు ప్రాధాన్యత తగ్గించారన్నారు అయినా కూటం ప్రభుత్వానికి కఅషి చేశామన్నారు తూర్పు కాపుల తమాషా ప్రకారం నామినేటెడ్‌ పదవులు ఇచ్చి వారి హక్కులను కాలరాయకుండా ఇవ్వాలన్నారు. తూర్పు కాపు మాజీ అధ్యక్షులు రొంగలి రామారావు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఎన్నికల్లో ప్రాధాన్య తగ్గించి సీట్లు ఇచ్చినప్పటికీ ఓటును విజయానికి కఅషి చేశామన్నారు ఈ తఫా ఇస్తున్న నామినేటెడ్‌ పదవులైన తూర్పు కాపులకు కేటాయించాలని అన్నారు. తూర్పు కాపులను అనగదొక్కే ప్రయత్నం చేయకూడదు అన్నారు. ఇది రాజకీయ పార్టీలకు శ్రేయస్కరం కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ పత్తి గిల్లి రామారావు, తూర్పు కాపు జిల్లా ఉపాధ్యక్షులు గెరిడా అప్పలనాయుడు, తూర్పు కాపు జిల్లా ముఖ్య సలహాదారు పిన్నింటి సూర్యనారాయణ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మొదిలి నాగభూషణరావు, మాజీ కోశాధికారి మొదిలి తరుణ్‌ లక్ష్యం తదితరులు పాల్గన్నారు తదితరులు పాల్గొన్నారు.

➡️