గోదారి ఒడిలో బాలోత్సవం

Feb 10,2024 22:22
సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం

సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం చిన్నారుల కేరింతలతో పులకరించింది. వారి ఆటపాటలతో తరించింది. సృజనాత్మకతకు దాసోహమైంది. పిల్లల ప్రతిభాపాటవాలకు పరవశించింది. ఎస్‌కెవిటి కశాశాల ప్రాంగణంలో ఉత్సాహ భరిత వాతావరణంలో గోదావరి బాలోత్సవం ఘనంగా శనివారం ప్రారంభమైంది.

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి

చారిత్రక రాజమహేంద్రవరంలో 2వ పిల్లల పండుగ గోదావరి బాలోత్సవం ఉత్సాహభరిత వాతావరంతో చిన్నారుల కోలాహలం మధ్య ఎస్‌కెవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను జెసి తేజ్‌భరత్‌ ప్రారంభించారు. ప్రారంభ సభ అమరజీవి షేక్‌ సాబ్జీ వేదికపై బాలోత్సవం అసోసియేట్‌ అధ్యక్షులు విఎస్‌ఎస్‌.కృష్ణకుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జెసి మాట్లాడారు. దేశంలో యువత, పిల్లలు అధికంగా ఉన్నారన్నారు. పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యాక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. బాలోత్సవంలో పాల్గొంటున్న విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని సూచించారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) మాట్లాడుతూ పిల్లలు విద్యతో పాటూ ఆటపాటల్లోనూ రాణించాలన్నారు. పిల్లల స్వేచ్ఛను హరించేలా నేటి విద్యా విధానాలను పాలకులు అనుసరిస్తున్నారని విమర్శించారు. గోదావరి బాలోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులూ భాగస్వాములు కావాలన్నారు. కొత్తగూడెం చిల్డ్రన్‌ క్లబ్‌ అధ్యక్షులు వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ 1991లో బాలోత్సవాన్ని కొత్తగూడెం కేంద్రంగా ప్రారంభించా మన్నారు. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున బాలోత్సవాలు జరుగుతున్నాయ న్నారు. తిరుమల విద్యా సంస్థల అధినేత, గోదావరి బాలోత్సవం అధ్యక్షులు నున్నా తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ పాటవాలను వెలుగులోకి తెచ్చేందుకు మాత్రమే బాలో త్సవాలు నిర్వహిస్తున్నా మన్నారు. అమరావతి బాలోత్సవం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ నేడు ఆటపాటలతో కూడిన విద్య అవసరమన్నారు. సమాజంపై అవగాహన పెంచుకోవా లన్నారు. సిసిసి ఎమ్‌డి పంతం కొండలరావు మాట్లాడుతూ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవాలు దోహదం చేస్తాయన్నారు. డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న బాలోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం బుచ్చిరామయ్య, నన్నయ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అల్లు బాబి, రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టికె.విశ్వేశ్వరరెడ్డి, డి.సత్యనారాయణ, డాక్టర్‌ చంద్రశేఖర్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు అరుణ కుమారి, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎన్‌.రాజు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.తులస ిమాట్లాడారు. 32 అంశాల్లో పోటీలు 32 అంశాల్లో సుమారు 60 సాంస్కృతిక, విద్య, విజ్ఞాన విభాగాల్లో నిర్వహించారు. సబ్‌ జూనియర్‌ జూనియర్‌, సీనియర్‌ విభాగాల వారీగా పోటీలు జరిగాయి. మట్టి బొమ్మల తయారీ, కార్టూన్‌లు గీయడం, దినపత్రిక చదవడం, అంతర్జాలంలో అన్వేషణ, పద్యం -భావం క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వం కోలాటం, జానపద నృత్యం, సంప్రదాయ నృతం చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్‌, విచిత్ర వేషధారణ, ఏకపాత్రాభినయం దేశభక్తి గీతాలాపన లఘు నాటిక బృందం, తెలుగులో మాట్లాడటం, కథలు చెప్పటం,జ్ఞాపక శక్తి పరీక్ష తదితర అంశాల్లో పోటీలు జరుగనున్నాయి.అలరించిన ప్రదర్శనలు విచిత్ర వేషధారణ, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటిషన్స్‌లో చిన్నారులు ప్రత్యేక ఆసక్తి చూపించారు. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో పలువురు అలరించారు. జానపద నృత్య ప్రదర్శనలు ఆకటు ్టకున్నాయి. కోయడ్యాన్స్‌లు అలరించాయి. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరిగిన వేదికలన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడాయి. చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. లఘునాటికలు, జానపద గేయాలు ఉత్సాహపరిచాయి. కోలాటం, చిత్రలేఖనం, దేశభక్తి గీతాలాపన, కథల పోటీలు ఎంతో ఆకట్టుకున్నాయి.

➡️