త్వరలో జంభూపట్నంలో బిఎంయు

Feb 24,2024 23:27
జంభుపట్నం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
కోరుకొండ మండలం జంభుపట్నంలో త్వరలో బల్క్‌ మిల్క్‌ యూనిట్‌ అందుబాటులోకి రానుందని జెసి తేజ్‌ భరత్‌ తెలిపారు. ఈ యూనిట్‌ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జంభూపట్నం గ్రామంలో రూ.16 లక్షలతో బల్క్‌ మిల్క్‌ యూనిట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఈ కేంద్రానికి 46 జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రాలు ద్వారా ప్రతి రోజూ 160 లీటర్ల మేర పాలను సేకరిస్తారన్నారు. ఐదు వేల లీటర్ల పాలు శీతలీకరణ చేసేందుకు ఈ బల్క్‌ మిల్క్‌ యూనిట్‌ సామర్థ్యం కలిగి ఉంటుందదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కి రూ.10 లక్షలతో యంత్ర పరికరాలు కొనుగోలు చేసిందన్నారు. మార్చి ఒకటి నుంచి పాల సేకరణ ప్రక్రియ ప్రారంభించనున్న దృష్ట్యా పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలని అదేశించారు. ఆయన వెంట జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్‌ ఎస్‌జిటి.సత్యగోవింద్‌, జిల్లా సహకార అధికారి వై.ఉమా మహేశ్వరరావు, డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ అధికారి ఎన్‌వివిఎస్‌.మూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️