పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరం: మంత్రి

Feb 10,2024 22:25
పరిసరాలను పరిశుభ్రతగా

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌

పరిసరాలను పరిశుభ్రతగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. శనివారం ఆయన ధవలేశ్వరం, ఐఒసిఎల్‌ కాలనీల్లో పర్యటించారు. పలు డ్రయినేజీ, పార్కుల పరిశుభ్రత, విద్యుత్‌ దీపాలు వంటి పలు సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పట్టణ, గ్రామాల్లోని ప్రతి వార్డులో డ్రయినేజీ మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్‌, సెప్టిక్‌ ట్యాంక్‌ మరమ్మతులు, స్ట్రీట్‌ లైట్స్‌ నిర్వహణ వంటి పలు అంశాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండకూడదన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. రూరల్‌ నియోజకవర్గ ప్రజలు ఏ కష్టం వచ్చినా సంకోసం లేకుండా తన దృష్టికి తీసుకు రావచ్చునని తెలిపారు. ఐఒసిఎల్‌ కాలనీలో సంకల్పం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పీచ్‌ ట్రైనింగ్‌ మరియు చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాల సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఎస్‌ఇ పాండు రంగారావు, ఎంపిడిఒ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

➡️