సీట్లు కేటాయింపుపై హర్షం

Feb 24,2024 23:25
సంబరాలు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం నుండి టిడిపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి ఇంట సంబరాలు జరిగాయి. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వీట్లు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన సతీమణి ఆదిరెడ్డి భవాని ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుండి ఎంఎల్‌ఎగా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం టిడిపి రాజమహేంద్రవరం సిటీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. భవారని చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు విద్య, వైద్యపరంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసును గతం కంటే ఘనమైన మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ మెట్లు ఎక్కిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అర్బన్‌ కార్యాలయం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను ఆయన కట్‌ చేశారు. గోకవరం : టిడిపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జగ్గంపేట నియజోకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూకు టిక్కెట్‌ను కేటాయించడంతో టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గోకవరం దేవిచౌక్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ఆశయాల మేరకు జగన్‌ పాలనను గద్దె దించుతామని తెలిపారు. రానున్న కాలంలో ప్రజలు వైసిపికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజవర్గంలో నెహ్రూ హయాంలోనే కళాశాలలు, పరిశ్రమలు, రహదారులు వంటి అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మంగరౌతు రామకృష్ణ, గాజింగం సత్తిబాబు, బత్తుల సత్తిబాబు, పాలూరి బోసుబాబు, గురుపే భరత్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️