ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం దేవిచౌక్ సెంటర్లో నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన స్వీట్ స్టాల్ యజమాని ఎన్. నానాజీ 95 కిలోలు నేతి లడ్డును అమ్మ వారికి నైవేద్యంగా సమర్పించిన విషయం విధితమే. ఈ లడ్డును ఆలయ కమిటీ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన కె. వెంకన్న 40, 500 (నలభై వేల, ఐదు వందలు) రూపాయలకు కైవసం చేసుకున్నాడు.
