90 శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ

Feb 1,2025 23:19
90 శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జిల్లాలో సజావుగా పూర్తి చేసినట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. మధ్యాహ్నం వరకు 90 శాతం మందికి ఇంటి వద్దకే వెళ్లి అధికారులు పెన్షన్‌ పంపిణీ చేసినట్టు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్‌ లబ్ధిదారులకు కలెక్టర్‌ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 2,36,331 మంది ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్‌ కింద రూ.102 కోట్ల 14 లక్షల 40 వేల మేర పంపిణీ చెయ్యడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,36,331 మందికి 17 కేటగిరీల్లో పెన్షన్‌ పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ ఆర్‌.కృష్ణ నాయక్‌, డిఆర్‌డిఎ పీడీ ఎన్‌వివిఎస్‌ మూర్తి, రూరల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ కెఎన్‌.జ్యోతి, ఎంపిడిఒ డి.శ్రీనివాసరావు, లబ్ధిదారులు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️