పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jan 16,2025 23:16
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజాశక్తి-పెరవలి, కడియం పెరవలి మండలం ఖండవల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గురువులు, ప్రత్యేక అతిథిగాఈ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి ప్రముఖ పారిశ్రామికవేత్త భూపతిరాజు శ్రీరామ రాజు పాల్గొన్నారు. అనంతరం మృతి చెందిన బ్యాచ్‌ పూర్వ విద్యార్థులకు ఘనంగా నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. తమకు విద్యా బుద్దులు నేర్పించిన గురువులకు పాదాభివందనం చేసి ఘనంగా సన్మానించారు. చదువులో పోటీపడి చదువుకుని వ్యాపార రంగంలో ఎంతో వృద్ధి సాధించటమే కాక ఖండవల్లి గ్రామంలో అనేక అభివద్ధి కార్యక్రమాలకు, ఎంతో మంది నిరాశ్రయులకు గుప్త దానాలు చేసిన భూపతిరాజు శ్రీరామ రాజును మిత్రులందరూ ఘనంగా సన్మానించారు. ఈ బ్యాచ్‌లో చదువుకుని మరణించిన కండిగ శ్రీను తల్లిదండ్రుల పరిస్థితి చూసి వారికి అండగా ఉండేందుకు రూ.50,000 నగదు, ఇదే బ్యాచ్‌లో చదువుకుని ఎంతో దీన స్థితిలో ఉన్న బీర చిరంజీవి కుటుంబాన్ని ఆదుకొనేందుకు రూ.50,000 నగదును శ్రీరామ రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా వచ్చి అలనాటి తీపి గుర్తులు నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారుకడియం మండలంలోని మురమండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1983-1984 బ్యాచ్‌ పదవ తరగతి విద్యార్థులు వారి కుటుంబాలతో పాఠశాలలో గురువారం 41 సంవత్సరాల అనంతరం కలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యను బోధించిన ఉపాద్యాయులు కొండ్రెడ్డి రామ్మోహన్‌ రావు, జొన్నలగడ్డ పుల్లాజి, బోళ్ల రఘును ఘనంగా సత్కరించారు. తొలుత పాధ్యాయులు విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు, ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలో సరస్వతీ విగ్రహం మండపం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నలమాటి రామారావు, గుణ్ణం విఠల్‌ బాబు, వేల్పూరి శ్రీనివాస్‌, ముత్యాల వెంకటరమణ, పుత్సకాయల సూరిబాబు, ఉప్పులూరి సుశీల, దేవళ్ళ రామ్మోహన్‌ రావు, చెరుకూరి నారాయణుడు, తూలూరి సూర్య ప్రకాశరావు, అన్నందేవుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️