ప్రజాశక్తి-చాగల్లు చాగల్లులో బుధవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మదర్ థెరిసా సేవా సమితి సమితి అధ్యక్షుడు పోలిశెట్టి శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నిరుపేద బి.టెక్ విద్యార్థిని కాకర్ల జగదీశ్వరికి ఆర్థిక సాయం అందించారు. ఉన్నత చదువుల నిమిత్తం రూ.ఐదు వేల సాయం అందించారు. తల్లి తండ్రి లేకపోయినా చదువు పట్ల శ్రద్ధతో, స్నేహితుల సహకారంతో అమ్మమ్మ తాతయ్య వద్ద ఉంటూ జగదీశ్వరి చదువుకుంటోంది. విషయం తెలుసుకున్న పోలిశెట్టి శ్రీనివాసరావు ఎంతో కొంత సహకారం అందించాలని ఉద్దేశంతో సాయం అందించారు. ఆకుల ప్రభాకర రావు పుట్టినరోజు సందర్భంగా సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదర్ థెరిసా సేవా సమితి అధ్యక్షుడు పోలిశెట్టి శ్రీనివాసరావును గ్రామ పెద్దలతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కరటూరి సతీష్, కొడవటి మెహర్, ముళ్లపూడి రాము పాల్గొన్నారు.
