ప్రజాశక్తి-నల్లజర్ల : మోటార్ సైకిల్ పై దీపావళి (టపాసులు) మందు గుండు సామగ్రిని తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో పేలిపోవడంతో మందు గుండు సామగ్రితో పాటు బైక్ కూడా ధ్వంసం అయిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఏలూరు జిల్లా పోలవరంకి చెందిన ఓ వ్యక్తి పోలవరం నుండి కొంత దీపావళి మందు గుండు సామాను సంచిలో వేసుకుని నల్లజర్లలోనికి బంధువులకు ఇచ్చేందుకు బయలుదేరి మోటార్ సైకిల్(ద్విచక్ర వాహనం)నానికి సంచి తగిలించుకుని వస్తూ ఉండగా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి మోటార్ సైకిల్ కి ఉన్న సైలెన్సర్ వేడికి సంచిలోని మందు గుండు సామాను ఫైర్ అయ్యి పేలడం ప్రారంభించాయి దీంతో సదరు వ్యక్తి బండి వదిలి పక్కకు తప్పుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు మందు గుండు సామానంతో పాటు బండి కూడా ధ్వంసం అయింది.