ప్రజాశక్తి-కడియం : మండల కేంద్రమైన కడియం రైల్వే స్టేషన్ సమీపంలో కడియం – ద్వారపూడి రైల్వే స్టేషన్ ల మధ్య KM.NO: 589/17-19 పోల్స్ వద్ద సుమారు 50 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై లోవరాజు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రకారం 22వ తేదీ ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడు లైట్ గ్రీన్ రంగు నెక్ బనియన్, గ్రే కాలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, మృతుని ముఖము పై పూర్తిగా గాయాలయి ఉన్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం జీఆర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లోవరాజు తెలిపారు. మృతుని వివరాలు, సమాచారం ఉంటే ఈ క్రింది నెంబర్లకు సమాచారం అందజేయాలని వారు తెలిపారు. సీఐ 9440627551, ఎస్సై 9491444022, రైల్వే పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ నెంబర్ 0833-2442821కు తెలియజేయాలని వారి విజ్ఞప్తి చేశారు.
