ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం, మర్కొండపాడు గ్రామంలో గురువారంం పశు సoమర్ధక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ యు ముకేశ్ పర్యవేక్షణలో పశు వైద్య శిబిరం ప్రారంభించారు పశువులకు- 92, దూడలకు-48, కోళ్ళకు-129 నట్టల నివారణ మందులు, లంపి చర్మ వ్యాధి- 74, గొంతువాపు వ్యాధి 292, కొక్కెర వ్యాధి- 400, నివారణ టీకాలు వేయడం జరిగినది. పశువులకు బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, గర్భకోశ వ్యాధుల చికిత్స -18, చూడు పరీక్షలు-14, చేయడం జరిగినది. పశువైద్య శిబిరంలో మరియు పాడిరైతులు – 67 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సర్పంచ్ .కండ్రిక లక్ష్మి శివ పోసి, ఎంపీపీ మట్టా వీరాస్వామి, వివిధ పార్టీల నాయకులు, సుంకవల్లి రమేష్ , ఉప్పులూరి చిరంజీవి, గ్రామ పెద్దలు, మరియు పశు సహాయ సిబ్బంది శ్రీలత, నాగేశ్వర్రావు , లక్ష్మి ప్రసన్న, అంబేద్కర్ , గౌతమ్, మౌనిక, శ్రావణి పాల్గొన్నారు.
