ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్, అడిషనల్ డైరెక్టర్ సూర్యప్రభను పలువురు శనివారం కలిసి కొన్ని ప్రధానమైన సమస్యలపై చర్చించారు. సిబ్బంది ఖాళీల విషయమై, ఉద్యోగుల సమస్యలపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆమె వారికి తెలిపారు. ఈ సమావేశంలో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున పి.గిరి ప్రసాద్ వర్మ, జిల్లా అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పి.రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు అంజలిశ్రీ, వి.ఆశీర్వాదం, వివి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
