‘నన్నయ’లో అథ్లెటిక్స్‌ పోటీలు ప్రారంభం

Dec 13,2024 22:27
అథ్లెటిక్స్‌

ప్రజాశక్తి – రాజానగరం
ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ ఛాంపియన్షిప్‌ కం యూనివర్సిటీ సెలక్షన్స్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.రిజిస్ట్రార్‌, స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ జి.సుధాకర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. తొలుత జాతీయ జెండా, స్పోర్ట్స్‌ జెండా, యూనివర్సిటీ జెండాలను ఎగురవేశారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ పోటీలకు హాజరైన 250 మంది క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రన్నింగ్‌, జంపింగ్‌, త్రోయింగ్‌ వంటి మూడు విభాగాల్లో మొత్తం 24 ఈవెంట్స్‌లో మెన్‌ అండ్‌ ఉమెన్‌ పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని నిర్వాహకులను అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు పి.సురేష్‌వర్మ, ఎన్‌.ఉదరు భాస్కర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఎస్‌.లింగారెడ్డి, ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ కొండ్రు సుబ్బారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చొల్లంగి వెంకట సుబ్రహ్మణ్యం, అబ్జర్వర్‌ సాల్మన్‌ దేవానంద్‌, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే…
హాఫ్‌ మరాథాన్‌(ఉమెన్స్‌లో) గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జిసిపిఇ కళాశాల విద్యార్థిని జి.పావని, కాకినాడ ఎఎస్‌డి గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ విద్యార్థిని ఎస్‌.సౌమ్యశిరీష, గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జిసిపిఇ కళాశాల విద్యార్థిని బి.నాగలక్ష్మిదుర్గ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మెన్స్‌ విభాగంలో తణుకు ఎస్‌సిఐఎండిసి విద్యార్థి బి.సురేష్‌, భీమవరం డిఎన్‌ఆర్‌ కాలేజ్‌ విద్యార్థి ఎ.మోహన్‌కృష్ణప్రసాద్‌, భీమడోలు కళాశాల విద్యార్తి పి.సాయిరామ్‌ వరుసగా మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. డిస్కస్‌ త్రో(ఉమెన్‌)లో గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జిసిపిఇ కళాశాల విద్యార్థిని సిహెచ్‌.శోభారాణి, నన్నయ యూనివర్సిటీ విద్యార్థిని ఎస్‌.శ్రీలక్ష్మీలావణ్య, గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జిసిపిఇ కళాశాల విద్యార్థిని కె.శ్రీదేవి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 5వేల మీటర్ల వాకింగ్‌(ఉమెన్స్‌)లో వి.నాగలక్ష్మి, సిహెచ్‌.ఝాన్సీ దుర్గ, ఎస్‌.పుష్పలత విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో బి.జీవన్‌కుమార్‌, యు.భీమయ్య, ఎన్‌.హేమసాయి విజేతలుగా నిలిచారు.

➡️