డెంగీ నివారణపై అవగాహనా ర్యాలీలు

May 16,2024 22:01
డెంగీ నివారణపై అవగాహనా ర్యాలీలు

ప్రజాశక్తి-యంత్రాంగం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా గురువారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. చాగల్లు బ్రాహ్మణగూడెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించారు. సమాజ భాగ్యస్వామ్యంతోనే డెంగీని నివారిద్దాం. జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణా కార్యక్రమం అంశాలపై అవగాహన కల్పించారు. దోమల నియంత్రణ మనందరి బాధ్యత, చిన్నదోమ-పెను ప్రమాదం, దోమ పుట్టరాదు-దోమ కుట్టరాదు, దోమ తెరలు వాడండి-దోమ కాటు నివారించండ, చేయి చేయి కలుపుదాం-డెంగీని నివారిద్దాం అని నినాదాలు చేశారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో ర్యాలి బ్రాహ్మణగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్‌ కె.నిషిత, పిఆర్‌ఎల్‌.దేవి, వి.పద్మ, ఎం.రాజశేఖర్‌, డివి.రామకృష్ణ, ఎఎన్‌ఎంలు, ఆశాలు, ఎడబ్ల్యు డబ్ల్యు టీచర్స్‌ తదితరులు పాల్గొన్నారు.ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.సావరంలో వైద్యాధికారి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌ ఆధ్వర్యంలో జాతీయ డెంగీ దినోత్సవం, డెంగీ నివారణా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారిద్దాం నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలన్నారు. డెంగీ వ్యాధి రాకుండా, దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఎం.సుబ్రహ్మణ్యం, ఆరోగ్య పర్యవేక్షకులు జిన్నూరి శ్రీనివాస రావు, ఎంఎల్‌హెచ్‌పి సంధ్యా లక్ష్మి, మహిళా ఆరోగ్య కార్యకర్త వై.రత్నకుమారి, మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌లు, విజరు, చిరంజీవి, రాము, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు.గోపాలపురం గుడ్డిగూడెంలో సర్పంచ్‌ మడిచర్ల ప్రసాద్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ మడిచర్ల ప్రసాద్‌, వైద్యాధికారి బివివి.దుర్గా భవాని మాట్లాడుతూ దోమల వల్ల కలిగే వైరల్‌ ఇన్ఫెక్షన్‌ డెంగీ గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. డెంగీ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వృద్ధి తారస్థాయికి చేరుకునే నేపథ్యంలో వాటిని నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీని అరికట్టడంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల తెరలు వాడాలని అన్నారు. ఇళ్ల చుట్టూ మురుగునీరు చెత్తా చెదారాలు నిల్వ లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్‌ తూతిగ రామకృష్ణ, హెల్త్‌ అసిస్టెంట్‌ త్రిమూర్తులు పాల్గొన్నారు.

➡️