మాజీ ఎంఎల్‌ఎ వెంకటేష్‌కు క్యాబినెట్‌ హోదా

Dec 4,2024 22:55
మాజీ ఎంఎల్‌ఎ వెంకటేష్‌కు క్యాబినెట్‌ హోదా

ప్రజాశక్తి – సీతానగరం, కోరుకొండ రాజానగరం మాజీ ఎంఎల్‌ఎ పెందుర్తి వెంకటేష్‌ను ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సమన్వయకర్తగా రాష్ట్ర మంత్రి హోదాను కేటాయిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేష్‌కు రాష్ట్ర మంత్రి హోదాను కేటాయించినట్లు అదేశాలు అందాయి. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మంత్రి కార్యక్రమాలు మరియు ఆయన రాష్ట్ర ప్రాధాన్యత యొక్క ఆర్టికల్‌ 18లో ర్యాంక్‌ కలిగి ఉంటారని ప్రభుత్వం తెలిపింది. రాజానగరం నియోజకవర్గం నుండి రెండుసార్లు వెంకటేష్‌ ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రజలు తనకిచ్చిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజలు మనసులో ఉన్న వ్యక్తులను అధిష్టానం గుర్తిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నమ్ముకున్న కేడర్‌, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. తన నియామకంపై బుధవారం రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, టిడిపి క్యాడర్‌ మొత్తం రాజమండ్రిలో వెంకటేష్‌ నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో వెంకటేష్‌ అభిమానులు ఆయా గ్రామాల్లో సంబరాలు చేసుకున్నారు.

➡️