ప్రజాశక్తి – నల్లజర్ల అవయవదానంపై పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమం నిర్వహిస్తామని అవయవదాత, ఎపి వైద్య ఉద్యోగుల సంఘం నేత జివివి.ప్రసాద్ వెల్లడించారు. నల్లజర్ల పిహెచ్‌సి ఆవరణలో జాతీయ అవయవదాన దినోత్సవం సందర్బంగా బుధవారం స్వచ్ఛంద సేవా సంస్థ ఆమెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాద్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిస్తూ విస్తత ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు. అవయవదాత ప్రసాద్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్‌ఐ రమేష్ అన్నారు. అవయవదానంతో పాటు ప్రజలకు ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రధానమన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్ తెల్లం గంగాధరరావు, డాక్టర్ మహ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రిన్సిపల్ ఆర్.వెంకటేశ్వరరావు తమ సంస్థ తరపున పిహెచ్‌సికి కంప్యూటర్ యుపిఎస్ అందించారు. ఆమెన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇవాంజలిన్ అశోక్ పిహెచ్‌సికి నాణ్యమైన మందులను అందజేశారు.