పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

Oct 2,2024 23:36
పరిసరాల పరిశుభ్రత

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. స్వచ్ఛత హి సేవా 2024 ముగింపు వేడుకలను బొమ్మురు గ్రామ పంచాయతీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌ ప్రశాంతి, ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు. తొలుత గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా తొమ్మిది అంశాల ప్రాతిపదికన చేపట్టిన పనులను ప్రజల్లోకి 17 రోజుల్లో తీసుకుళ్లి భాగస్వామ్యం చేశామన్నారు. గాంధీజీ ఆశయల్లో పారిశుధ్య నిర్వహణా అత్యంత కీలకమైన అంశం అన్నారు. తడి, పొడి చెత్త విషయంలో ప్రతి ఒక్కరు కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో గ్రామాలన్నీ జీరో వేస్ట్‌ విధానంలో పరిశుభ్రత పాటించడంలో వ్యక్తిగత బాధ్యత వహించాలన్నారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి విజన్‌ 2047 కి చెందిన ప్రతిపాదనలను అమోదించామన్నారు. జిల్లాలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపి, ఉత్తమ ఫలితాలు సాధించిన పంచాయతీ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను ముఖ్య అతిధులు శాలువా, ధ్రువ పత్రం, మెమెంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డి.శ్రీనివాసరావు, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ కెఎస్‌.జ్యోతి, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఎం.నాగలత తదితరులు పాల్గొన్నారు.

➡️