జన సైనికుని కుటుంబానికి పరామర్శ 

Feb 10,2024 15:12 #East Godavari
condolence janasena family

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: జనసేన పార్టీ జనసైనికుని కుటుంబానికి శనివారం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జి బివిఎస్ఎన్ ప్రసాద్ పరామర్శించి, సానుభూతి తెలిపారు. మండలంలోని చివటం గ్రామానికి చెందిన కటికిరెడ్డి దత్తాత్రేయ ప్రసాద్, నారాయణ సోదరులు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి జనసైనికులుగా పార్టీలో ఉంటున్నారు. వారి తల్లి కటికి రెడ్డి వరలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా జె ఎస్ పి ఇంచార్జ్ ప్రసాద్, సోదరుల తండ్రి వెంకటేశ్వరరావు ను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, జన సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️