అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నిరసన

Jan 9,2025 22:37
కాంగ్రెస్‌

ప్రజాశక్తి – గోపాలపురం
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాపై చర్యలు తీసుకునే వరకూ కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టికె.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక చెక్‌పోస్టు సెంటర్‌ వద్ద మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మట్టపర్తి రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఈ మేరకు నిరసన తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ లోకసభలో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు . అంబేద్కర్‌ను హేళన చేస్తే ఊరుకోబొమని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకొచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి చూస్తున్నాయన్నారు. ప్రస్తుతం తగినంత మెజారిటీ లేకపోవడంతో బిజెపి సర్కారు అసహనంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ మార్టిన్‌ లూథర్‌, పిసిసి సభ్యులు జ్యేష్ఠ సతీష్‌బాబు, గన్నిన రామారాయుడు, విల్లూరి రమేష్‌, కె.రతన్‌రాజు, కె.బాబాజీరావు, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు సునీల్‌, ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.ఛాగల్లు : పార్లమెంట్‌ సాక్షిగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చాగల్లులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మట్ట సుబ్బారావు అధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహం పాదాల వద్ద వినతిపత్రం ఉంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌సి సెల్‌ జిల్లా చైర్మన్‌ శాఖ పుల్లారావు, నియోజకవర్గం చైర్మన్‌ గల్లా భాస్కరరావు మండల ఉపాధ్యక్షులు కొక్కురుపాటి బుల్లిస్వామి, మహిళా అధ్యక్షురాలు కె.లక్ష్మీరెడ్డి, కొవ్వూరు టౌన్‌ అధ్యక్షులు బచ్చు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️