ఘనంగా కాటన్‌ జయంతి వేడుకలు

May 15,2024 22:28
ఘనంగా కాటన్‌ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-యంత్రాంగం రాజమహేంద్రవరం రూరల్‌ ఉభయ గోదావరి జిల్లాలను సస్య శ్యామలం చేసిన అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 221వ జయంతి సందర్భంగా స్థానిక లాక్‌ లైన్‌ ఏరియాలో కాటన్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు కాటన్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీర్రాజు మాట్లాడుతూ గోదావరి జిల్లాల బీడు భూములను పంట భూములుగా మార్చిన ఘనత కాటన్‌దేనన్నారు. రైతుల గుండెల్లో చిరస్థాయిగా దేవుడిగా నిలిచిపోయాడని ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ కాటన్‌ బ్యారేజీ నిర్మించి రైతులు అనేక విధాలుగా మేలు చేశారన్నారు. ఇన్ని లక్షల ఎకరాలు సస్యమంగా ఉన్నాయంటే ఆ అపర భగీరథుడు కాటన్‌ పుణ్యమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మోర్త పవన్‌ మూర్తి, శ్రీరంగం బాలరాజు, జంగా కిషోర్‌, వంటెద్దు కష్ణ, ముత్యాల అనంతబాబు, గునుపే అశోక్‌, పందిర్ల భాను, గూటం రాజు, పులపర్తి కిషోర్‌, నంబూరి రవి, మిరప రమేష్‌, స్వదీప్‌, బాలు, టింకు, బప్పు, దిలీప్‌ పాల్గొన్నారు.కడియం కాటన్‌ జయంతి వేడుకలు కడియంలో ఘనంగా నిర్వహించారు. కడియం బ్రాహ్మణరేవు వద్ద ఉన్న కాటన్‌ విగ్రహానికి రైతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీడు భూములను మాగానులుగా మార్చిన కాటన్‌ సేవలను మనం నిరంతరం గుర్తుంచుకోవాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ దేవరపు నీలకంఠరావు, రైతు నాయకులు చిక్కాల శ్రీనివాసరావు, దొడ్డా బుజ్జి, బండారు భాస్కరరావు, కోలా సురేష్‌, పొన్నా ప్రసాద్‌, ఉండమట్ల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతం పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండడానికి కారుకులైన కాటన్‌ నిత్య ఆరాధ్యుడని, వారు భారతీయుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచేందుకు నేరేడు, మామిడి పళ్లుకు కాటన్‌ దొర, మోక్షగుండం పేర్లు పెట్టినట్టు కడియపులంక సర్‌ ఆర్దర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పెనుమాక కొండబాబు తెలిపారు. అసోసియేషన్‌ కార్యాలయ ఆవరణలో కాటన్‌ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు థాయిలాండ్‌ నుండి నేరేడు, మామిడి మొక్కలను గత ఆరు ఏళ్ళ క్రితం దిగుమతి చేసుకొని ఆ మొక్కలకు ఈ ప్రాంతం మొక్కలతో అంటుకట్టి కొత్తరకం మొక్కలను రూపకల్పన చేశారు. వాటికి మొదటి పంటగా వచ్చిన నేరేడు ఫలాలను మాలగా ఏర్పాటు చేసి కాటన్‌ విగ్రహానికి వేశారు. ఆ మహానుభావుని పేరు తరతరాలు గుర్తుండేలా నేరేడు పండుకు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నేరేడని, మామిడి పండుకి కాటన్‌ బ్యారేజీ నిర్మాణంలో గ్రేట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో నర్సరీ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లా చంటియ్య, పాటంశెట్టి చినమహలక్ష్మీ నాయుడు, మార్గాని సత్యనారాయణ, పల్ల సుబ్రమణ్యం, భాస్కర రావు, తాడాల చక్రవర్తి, బొర్సు వెంకట్రాయుడు, పుల్లా పెద సత్యనారాయణ, తాడాల రవి, గాద నాగేశ్వరరావు, గట్టా కృష్ణ, తాడాల బాలమురళీకృష్ణ, జంగా సుబ్బారావు, గరగ నాగేశ్వరరావు, అడ్డగర్ల రమేష్‌, పిల్లా శ్రీనివాస్‌, గాజుల రత్తయ్య, రావిపాటి రామకృష్ణ, కొండేపూడి నాగు, వడ్లమూరి రాజేష్‌ పాల్గొన్నారు.

➡️