12వ రోజు వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం

May 25,2024 14:16 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి మండలం( తూర్పుగోదావరి జిల్లా) : ముక్కామల శాఖాగ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ కార్యక్రమం 12వ రోజు శనివారం ఉదయం 8 గంటల నుండి 11-30 వరకు నిర్వహించారు. విద్యార్థులకు , నీతి కథలు చెప్పడం విద్యార్థులతో చెస్, క్యారమ్స్ స్నేక్ & లేడర్, లూడో ఆడించడం జరిగినది. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చెప్పడం వారికి ఇష్టమైన కథల పుస్తకాల చదివించి వేమన పద్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్, డాన్స్, యోగ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. విరామ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ కె. విశ్వనాథం కే .కామేశ్వరరావు ,శ్రీమతి కే భవాని మధులీల గ్రంథాలయ అధికారి ఎం. వెంకటేశ్వర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

➡️