4వ రోజు వేసవి విజ్ఞాన శిబిరం 

May 18,2024 14:35 #East Godavari

ప్రజాశక్తి-కడియం : వేసవి విజ్ఞాన శిబిరం శిక్షణా తరగతులుశనివారం 4వ రోజు చేరాయి. శాఖా గ్రంధాలయా ధికారిణి నిర్మల ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ‘హెల్త్ సూపరవైజర్ కృష్ణ వేణివిచ్చేసి మాట్లాడుతూ శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి రోజు గ్రంథాలయాలకు వచ్చి మహనీయులు జీవిత విశేషాలు, వైజ్ఞానిక పుస్తకాలు చదివి స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తదుపరి విద్యార్థులకు ఆరోగ్య జాగ్రత్తలు చేతులు కడుగుకొనుటలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె పేర్కొన్నారు. పంచతంత్రం నీతికథలు గ్రంధాలయ సభ్యులు విద్యార్థులకు వివరించారు తెలుగు వ్యాకరణం ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. తదుపరి బాలల గేయాలు ఆలపించారు. వివిధ స్కూళ్ల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది. హెల్త్ సిబ్బంది అన్నవరం తదితరులు పాల్గొన్నారు.

➡️