ప్రజాశక్తి-గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలింది. మూడు రోజుల వ్యవధిలో సుమారు 32 డయేరియా కేసులు గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంకు రాగా పేషెంట్లకు వైద్యం అందించారు. వైద్యం పొందిన వారిలో 25 మంది కోల్కొవడంతో డిశ్చార్జ్ చేయగా ఏడుగురు ప్రస్తుతం వైద్యం పొందుతున్నారని, వీరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని డిఎం అండ్ హెచ్‌ఒ కె.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. డిప్యూటీ డిఎం హెచ్‌ఒ జె.సంధ్యతో కలిసి గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న డయోరియా పేషంట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. పేషంట్లను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పిహెచ్‌సి డాక్టర్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి డయేరియా కేసులపై ఆరా తీశారు. డయేరియా కేసు నమోదైన గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాలలో చేయవలసిన సర్వేలు, విధివిధానాలను వారికి వివరించారు. అనంతరం విలేకరులతో డిఎం అండ్ హెచ్‌ఒ మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మండలంలో సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్నదేవరపేట పిహెచ్‌సి, హుకుంపేట పిహెచ్‌సి పరిధిలో సుమారు 30 డయోరియా కేసులు నమోదైనట్లు తెలిపారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో 1 కేసు నమోదైనట్టు తెలిపారు. వారందరికీ గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించినట్లు తెలిపారు. మండలంలో పొగాకు పనులకు వచ్చిన కూలీలకు డయోరియా వచ్చినట్లు తెలిపారు. అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు, డయేరియా కేసులు గుర్తించేందుకు 20 ప్రత్యేక మెడికల్ టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎపిడమాలజిస్ట్, ఎపిడెమిక్ టీములు వాటర్, స్టూలు శాంపిల్స్, పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాలలో సర్వే లైన్స్ వైద్య సిబ్బంది డయేరియా కేసులపై సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఆర్డబ్ల్యుఎస్, డిపిఒ, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఏదైనా అనుమానం ఉన్న, వాంతులు, విరేచనాలు లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.ప్రభుత్వాసుపత్రిని సదర్శించిన ఆర్‌డిఒగోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న డయేరియా పేషెంట్ల వద్దకు కొవ్వూరు ఆర్‌డిఒ రాణి సుస్మిత ఆదివారం రాత్రి వచ్చి ఆరోగ్య పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డయేరియా నమోదైన అన్ని గ్రామాల నుండి రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పలు శాఖ అధికారులతో కలిసి సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్, పొగాకు శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌డిఒ వెంట తహశీల్దారు అజరు బాబు, వ్యవసాయ శాఖ ఎడి చంద్రశేఖర్, ఎఒ రాజారావు, ఆర్‌ఐ హరీష్, డాక్టర్ దేవిశ్రీ పాల్గొన్నారు.
