ప్రజాశక్తి-రాజమహేంద్రవరంస్థానిక నాగరాజా ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మోటూరి మంగారాణి, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ స్వచ్చంద సేవా సంస్థ వారిచే ‘విశిష్ట సేవా రత్న” పురస్కారం అందుకున్నారు. ట్రస్ట్ అధినేత డాక్టర్ మేడిది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నేడు విద్య, సామాజిక, సాంస్కృతిక, కళారంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురిని గుర్తించి పురస్కారాన్ని అందచేసి సత్కారం చేసినట్టు తెలిపారు.
