దాతల సాయంతో వైద్య సేవలు

Oct 3,2024 22:45
దాతల సాయంతో వైద్య సేవలు

ప్రజాశక్తి-చాగల్లు దాతలు అందించే ఉచిత వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎఎంసి చైర్మన్‌ ఆళ్ల హరిబాబు అన్నారు. మండలంలో బ్రాహ్మణగూడెంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టిడిపి మండల నాయకులు ప్రత్తిపాటి వెంకట సుబ్బారావు ఆ్యధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా తెలుగు యువత నాయకులు నాదెళ్ల శ్రీరామ్‌ మాట్లాడుతూ పేదప్రజలకు వైద్య సేవలందించడానికి దాతలు ముందుకు రావడం అబినందనీయం అన్నారు. అనంతరం వైద్యశిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వైద్యశిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి భాను తేజ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు గుండె, ఊపిరితిత్తులు, ఎముకలుకు సంబందించిన ఇతర వ్యాధులతో పాటు స్త్రీలకు సంబందించిన వ్యాధులకు చికిత్స అందించారు. వైద్యులు డాక్టర్‌ గౌస్‌బేగ్‌, ఎం.హరిభాను థెరిసా వైద్య సేవలు అందించారు. ఈ సందర్బంగా శిభిరం నిర్వహకులు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ 200 మందికి పైగా ఈశిబిరం ద్వారా వైద్య సేవలందించి మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గారపాటి బాబూరావు, దొమ్మేటి వేణు, అల్లూరి రామకృష్ణ, శ్రీని సత్యనారయణ, గారపాటి మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️