స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Feb 12,2024 12:44 #East Godavari
fire accident in nalajarla

ప్రజాశక్తి-నల్లజర్ల : నల్లజర్ల మండలం పోతవరం గ్రామం శివారు స్థానిక చికెన్ సెంటర్ వద్ద సోమవారం నల్లజర్ల టు కొయ్యలగూడెం రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా చిప్స్ (మెటల్) లారీ అన్లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇంజన్ వద్ద ఫైర్ అవటంతో మంటలు అలముకున్నాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి రోడ్డుకిరువైపులా వాహనాలను నిలువరించి అనంతరం ఇసుక నీరు చల్లి మంటలను అదుపు చేశారు దీంతో భారీ ప్రమాదం తప్పింది. చుట్టుప్రక్కల ఇళ్లలోని వారు భయంతో పరుగులు తీశారు. మంటలు అదుపు అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

➡️