భారీ విజయం దిశగా పిడిఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తి

Dec 9,2024 13:22
గోపిమూర్తి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి పోటీ చేసిన పిడిఎఫ్‌ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి విజయం దాదాపు ఖాయమైంది. ఏకపక్షంగా ఆయన గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం గోపిమూర్తికి 9,163 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి గంధం నారాణరావుకు 5,008 ఓట్లు వచ్చాయి. అన్ని టేబుల్స్‌లోనూ గోపిమూర్తి తన హవాను కొనసాగించారు. టేబుల్‌కు వెయ్యి ఓట్లు చొప్పున లెక్కింపు మొదలు పెట్టారు. మెదటి టేబుల్‌లో వేయి ఓట్లలో గోపి మూర్తికి 665, రెండో టేబుల్‌లో 665, మూడో టేబుల్‌లో 607, 4వ టేబుల్‌లో 698, 6వ టేబుల్‌లో 580, 8వ టేబుల్‌లో 585, 9వ టేబుల్‌లో 544, 10వ టేబుల్‌లో 581, 11వ టేబుల్‌లో 556, 12వ టేబుల్‌లో 607, 13వ టేబుల్‌లో 544, 14 టేబుల్‌లో 666 ఓట్లను గోపి మూర్తి సాధించారు. 5వ టేబుల్‌కు సంబంధించి ఓట్లు ఇంకా లెక్కిస్తున్నారు. దీంతో మొదటి ప్రాధాన్యతా ఓటులోనే గోపిమూర్తి విజయం దాదాపు ఖాయమైనట్టు స్పష్టమవుతుంది.

➡️