ప్రజాశక్తి – నిడదవోలు
ప్రభుత్వ పాఠశాలలను రక్షించాలని, దీని కోసం ఉపాధ్యా యులంతా నడుం బిగిం చాలని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్. ప్రసాద్ పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా మహాసభ నిడదవోలు కాపు కళ్యాణ మండపంలో జరిగింది. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.జయకర్, ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ మహా సభలో ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వ విధా నాలు ప్రభుత్వ పాఠశాలల ఉనికికి గుదిబండలుగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతే సమాజంలో పేద పిల్లలకు అన్యాయం జరిగినట్టేనన్నారు. రోజు రోజుకూ ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతోందన్నారు. ఇది డిఎస్‌పి అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లినట్టేనన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే దిశగా త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి యుటిఎఫ్ స్వర్ణోత్సవాల్లో ప్రణాళికలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి మాజీ ఫ్లోర్ లీడర్ విఠలపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై ఆలోచించా లన్నారు. పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి బొర్రా గోపిమూర్తిని గెలిపించాలని కోరారు. విద్యా వ్యవస్థపై సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి గోపిమూర్తి అని అన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం మారినా విద్యా వ్యవస్థలో బోధ నేతర పనులు ఒత్తిడి మారలేదన్నారు. యాప్‌ల యాతనతో ఉపాధ్యాయులు సతమతమవు తున్నార న్నారు. యాప్‌ల వల్ల బోధనా సమయం హరించుకు పోతుందన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయకర్, షరీఫ్ మాట్లాడుతూ నూతన పిఆర్‌సి కమిషన్‌ను వెంటనే వేయాలని, ఐఆర్‌ను ప్రకటిం చాలని, బకాయి డిఎలు చెల్లించాలని, పిఆర్‌సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.