ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 11,2025 23:30
ఘనంగా సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి ఉత్సవాలను శనివారం పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగం రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలోని విజన్‌ మెడికల్‌ అండ్‌ ఐఐటి అకాడమీ ఆధ్వర్యాన సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. అకాడమీ ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌ యాగా గోవిందరాజు అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, స్టాఫ్‌ పాల్గొని వివిధ పోటీల్లో ఉత్సాహంగా గడిపారు, భోగి మంటలు వెలిగించి, ఆట పాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం డైరెక్టర్‌ గోవిందరాజు మాట్లాడారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి, డైరెక్టర్‌ యాగా గోవిందరాజు బహుమతులు అందజేశారు. చాగల్లు సంక్రాంతి సంబరాలను శ్రీరాజరాజేశ్వరి విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విద్యాలయ కరెస్పాండెంట్‌ వివి.రామారావు మాట్లాడుతూ తెలుగు సంస్కతీ సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలను తెలియజేయడమే సంబరాల ఉద్దేశం అన్నారు. మార్కొండపాడులో 91, 93, 94 అంగన్‌వాడీ కేంద్రాల వద్ద సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్‌ జ్యోత్న్స మాట్లాడారు. తెలుగు సంప్రదాయ పండుగలను సంక్రాంతి సంబరాలు ఎంతో ప్రత్యేకమైన వని ఆమె అన్నారు. అంగన్వాడీ టీచర్లు రమాదేవి, పుష్పరాజ్యం, హెల్పర్స్‌ వెంకటలక్ష్మి, సుజాత పాల్గొన్నారు. తాళ్లపూడి చిన్నతనం నుండి ప్రతి ఒక్కరికీ సంస్కతీ సంప్రదాయాలను తెలియజేసేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని కరిబండి విద్యాసంస్థల డైరెక్టర్‌ కె.త్రినాథ స్వామి తెలిపారు. విద్యాసంస్థల ప్రాంగణంలో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా ఇంటర్‌ డిగ్రీ విద్యార్థులకు ముగ్గులు, క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ సంబరాల్లో ప్రిన్సిపల్‌ మురళి, అధ్యాపకులు డి.మాధవరావు, సత్యనారాయణ, పాపారావు, రాజేష్‌, గీత, అమరేంద్ర, సాయి పాల్గొన్నారు. నిడదవోలు రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ కొండేపాటి రామకృష్ణ, క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పైడి సురేష్‌, క్లబ్‌ ప్రెసిడెంట్‌ కంటమని గోపాలకృష్ణ, స్ప్రింగ్‌ బోర్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీ తరువాత స్ప్రింగ్‌ బోర్డ్‌ స్కూల్‌ విద్యార్థులచే సంక్రాంతి పాటలకు నృత్యాలు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. బండి గోపాలకృష్ణ, నీరుకొండ సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌, మాచర్ల మధుసూదనరావు, బొల్ల శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యనారాయణ, పొన్నా సుబ్రహ్మణ్యం, వార్డు కౌన్సిలర్‌ శిరీష పాల్గొన్నారు.కడియం మినర్వా విద్యాసంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత భోగిపళ్లు వేడుక నిర్వహించారు. విద్యార్థులు సంక్రాంతి లక్ష్మి, ధాన్య లక్ష్మి, రైతు, గంగిరెద్దు, హరిదాసు, కొమ్మ దాసరి, పిట్టలదొర, సోదెమ్మ, బుడబుక్కల వాళ్ళు, వివిధ దేవతా మూర్తుల వేషధారణలలో కనువిందు చేసారు. కరస్పాండెంట్‌ సిహెచ్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచీ సంస్కతి పంప్రదాయాలు మీద అవగాహన కల్పించేందుకు ఏటా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

➡️