ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 15,2025 22:54
ఘనంగా సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-తాళ్లపూడి నేటితరం మరిచిపోతున్న పాత జ్ఞాపకాలను సంస్కతిని గుర్తుకు తేవడంతోపాటు భావితరాలకు తెలియజేసే విధంగా మండలంలోని అన్నదేవరపేట గ్రామంలో యువగళం నాయకులు కార్యకర్తలు మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చే విధంగా ఒక ఇంటిని నిర్మించడంతోపాటు ఆ ఇంటి అరుగుపై పదిమంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. ఇంతేకాక వ్యవసాయానికి గుర్తుగా బండిని తయారు చేసి ప్రదర్శించారు. గ్రామానికి వచ్చిన ఆడపడుచులు బంధువులు ప్రవాసాంధుల సంక్రాంతి సంబరాలను ఏర్పాటును చూసి అక్కడ ఫోటోలు తీయడంతో పాటు ఆనందంతో చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. నాయకులు కాకర్ల సత్యేంద్ర, గణపతి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సత్యేంద్ర మాట్లాడుతూ రానున్న కాలంలో మరింత శోభాయమానంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త టిడిపి నాయకులు జివి.ప్రసాద్‌ మాట్లాడుతూ తమ గ్రామాల్లో చేసిన ఏర్పాట్లు తిలకించడానికి ఆస్ట్రేలియా, యుఎస్‌ఎ తదితర దేశాల నుంచి వివిధ గ్రామాలకు చెందిన ప్రవాసాంధ్రులు సైతం వచ్చి సంబరాల్లో పాల్గొన్నారన్నారు.

➡️