సమీక్షా సమావేశంలో ఎస్‌పి నరసింహకిషోర్
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచాలని పోలీసు అధికారులను ఎస్‌పి డి.నరసింహకిషోర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బహిరంగ మద్యపానం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా రిఫ్ రాఫ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. డయల్ 112కు వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించాలన్నారు. నాటు సారా, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఆయా ప్రాంతాలలోని ప్రజల నుంచి సమాచారం తీసుకుని దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రత, ఇంటి భద్రతపై ప్రతి రోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్‌పిలు అల్లూరి వెంకటసుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎల్.చెంచిరెడ్డి, ఎస్‌బి డిఎస్‌పి బి.రామకృష్ణ, ఎస్‌బి సిఐ ఎ.శ్రీనివాసరావు, డిఎస్‌సిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
