ఐదో రోజుకు ఆశా వర్కర్ల దీక్ష

Jun 8,2024 23:05
ఐదో రోజుకు ఆశా వర్కర్ల దీక్ష

ప్రజాశక్తి-నల్లజర్లపోతవరం ఆరోగ్య కేంద్రం(2) పరిధిలో ఆశ వర్కర్లు చేపట్టిన నిరవధిక నిరహార దీక్ష శనివారం ఐదో రోజుకు చేరింది. ఎఎన్‌ఎం జిఆర్‌ఎల్‌ దుర్గాదేవి, ఆశా వర్కర్లను వేధిస్తుండడమే కాక ప్రజల ముందు అవమానపరుస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎఎన్‌ఎంను అధికారులు వెనకేసు రావడం వెనక ఆంతర్యం ఏమిటని ఆశ వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పోసమ్మ ప్రశ్నించారు. నేటికి ఐదు రోజులుగా ఆసుపత్రి ఎదుట ఆశా వర్కర్లు నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ అధికారుల్లో స్పందన కరువైందన్నారు. ఎఎన్‌ఎంను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు కష్టమొస్తే సమస్యలు పరిష్కరించకుండా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఈ దీక్షలో రత్నమాల, జయమ్మ, సరోజినీ, దుర్గా దేవి, సుభద్ర కుమారి, మంగమ్మ, సౌదామణి పాల్గొన్నారు.

➡️